![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో..... సీతాకాంత్ స్కూల్ కి రావడం చూసిన శ్రీవల్లి, శ్రీలతకి చెప్తుంది. మనం వచ్చాము కదా స్కూల్ కి వాడేందుకు వచ్చాడు.. వాడి వెనకాలే వెళ్లి కనుక్కోవాలని శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి కోసం వెతుకుతుంటాడు. రామలక్ష్మి ఎదరుపడి కిందపడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. మళ్ళీ ఎప్పటిలాగే నువ్వు నా రామలక్ష్మివి అంటుంటాడు. కాదని రామాలక్ష్మి అంటుంది. అదంతా దూరం నుండి శ్రీలత వాళ్ళు చూస్తుంటారు కానీ సీతాకాంత్ అడ్డుగా ఉండడంతో రామలక్ష్మి మొహం కన్పించదు.
రామలక్ష్మి అక్కడ నుండి రామ్ ఉన్న క్లాస్ లోకి వెళ్తుంది. క్లాస్ లోకి వెళ్ళేటప్పుడు.. రామ్ ఆయిల్ పోస్తాడు. అది రామలక్ష్మి చూస్తుంది. రామలక్ష్మిపై రివెంజ్ తీర్చుకోవడానికి రామ్ ప్లాన్ చేసినవి అన్ని రామలక్ష్మి కనిపెడుతుంది. ఈ చాక్లెట్ ఈ డ్రాయింగ్ వేసిన వాళ్ళకిద్దామనుకున్నా.. అయ్యో ఎవరు లేరా.. ఈ చాక్లెట్ నేనే తింటానని రామలక్ష్మి అనగానే.. దాక్కొని ఉన్న రామ్ బయటకు వస్తాడు. ఇదంతా నాపై రివెంజ్ ప్లాన్ చేసావా.. మీ నాన్నని పిలవమని చెప్తాననగానే వద్దని రామ్ అంటాడు. అయితే మీ అమ్మని రేపు తీసుకొనిరా అని రామలక్ష్మి చెప్తుంది. రామ్ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ.. రేపు మా మేడమ్ అమ్మని తీసుకొని రమ్మంది. నాకు రేపు ప్రొద్దున కల్లా అమ్మ కావాలంటు రామ్ చెప్తాడు.
మరుసటి రోజు రామలక్ష్మి ధ్యానం చేస్తుంటుంది అయిన సీతాకాంత్ గుర్తుకు వస్తుంటాడు. అప్పుడే సుశీల, ఫణింద్రలు వచ్చి రామలక్ష్మి తో మాట్లాడతారు. నువ్వు మైథిలిగా ఉండడం మా అదృష్టం అంటారు. ఆ తర్వాత సీతాకాంత్ సిరి ఫోటో దగ్గరికి వెళ్లి బాధపడతాడు. ఒకవేళ రామలక్ష్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో.. వెళ్లి ఆ బాబు నీ బాబు అని చెప్తానంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |